Telangana
800 దాటి ఐదుగురు ఓటర్లున్నా ప్రత్యేక పోలింగ్ కేంద్రం
Kalinga Times, Hyderabad : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సం ఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలను స్థానికంగా ముద్రించుకోవచ్చని పేర్కొన్నది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ముద్రణ సంస్థలను ఎంపిక చేయాలని ఎస్ఈసీ సూచించింది.800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని, 800 దాటి ఐదుగురు ఓటర్లున్నా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది