![](https://www.kallingatimes.com/wp-content/uploads/2019/07/amit-copy-780x405.jpg)
Kalinga Times, Hyderabad : బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. అమిత్ షాకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్ రావులతోపాటు ఎంపీలు ఎమ్మెల్యే బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లి సమీపంలోని రంగనాయకుల తండా చేరుకున్నారు. రంగనాయకుల తండాలో సోనీనాయక్ అనే గిరిజన మహిళ ఇంటికి చేరుకున్నారు. సోనీ నాయక్ ఇంట్లో అమిత్ షా లంచ్ చేశారు. అమిత్ షా తోపాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ లు భోజనం చేశారు. అనంతరం సోనీనాయక్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు