National
2024లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే

Kalinga Times ,Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందని గట్టి నమ్మకం తనకు ఉందన్నారు అమిత్ షా. . బీజేపీని బలోపేతం చేసేందుకు బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్ లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. 2024లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు
శంషాబాద్ లోని కేఎల్ సీసీ సెంటర్ లో కార్యకర్తలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కేంద్రంలో బీజేపీ ప్రచండ విజయం సాధించిందని అంతే ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అఖండ విజయం సాధించిన తర్వాత తాను తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా వచ్చానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 29 శాతం ఓట్లు ఇచ్చి బీజేపీని ఆదరించిన ప్రతీ తెలంగాణ పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో ఖచ్చితంగా కాషాయి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఊడ్చేపనిలో పడింది. జనసేన నేతలకు సైతం గాలం వేస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గుబులు రేపింది బీజేపీ.