Kalinga Times ,Hyderabad : చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వీలుకాదట, తనవల్ల కాని పనులు ఇంకెవరూ చేయలేరన్నట్టు సెలవిచ్చారని ఎద్దేవా చేశారు. ఇచ్చినమాట ప్రకారం జగన్ చేసి చూపిస్తారు. మీరూ చూస్తారంటూ ట్వీట్ చేశారు. అలాగే లోకేష్‌పై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. అందనంత స్థాయి అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా? అంటూ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 5, 2019