
Kalinga Times ,Hyderabad : కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఇప్పటికే అపొజిషన్ లీడర్లు భగ్గుమంటున్నారు. ఆ క్రమంలో ఇదివరకు హైకోర్టు చాలాసార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అదలావుంటే హైకోర్టులో నడుస్తున్న మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసులో ఊహించని తీర్పు రావడం ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే పరిస్థితి నెలకొంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసుకు సంబంధించి శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. అయితే కోర్టును ధిక్కారించారనే కారణంతో ముగ్గురు అధికారులకు శిక్ష విధించింది. సిద్ధిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు రెండు వేల రూపాయల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.