Religious
అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి.
Kalinga Times, Tirupati : లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, ఇరు దిశలా గజరాజులు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు దర్శమిస్తారు. మహాలక్ష్మీ దేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈ తల్లి క్షీరాబ్ధి పుత్రిక. చంద్రుని సహోదరి. శ్రీహరి పట్టపురాణి. డోలాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి. ‘యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్ధితా అంటే అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఎరుపు రంగు పూలతో, లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తూ లక్ష్మి యంత్రాన్ని పూజించాలి. శ్రీమహాలక్ష్మిదేవి అమ్మవారికి పూర్ణాలు నివేదన చేయాలి.