social
కె.పి.హెచ్.బి. లో లలితా జ్యువెలరీ మార్ట్ ప్రారంభోత్సవం
Kalinga Times ,KPHB : దక్షిణ భారత దేశం లోనే నగల వ్యాపారం లో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెలరీ ఇపుడు కూకట్ పల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కె పి హెచ్ బి కాలనీ లో లలితా జ్యువెలరీ మార్ట్ ప్రారంభోత్సవం చేశారు ,ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిదులు గా తెలంగాణ హోమ్ మినిష్టర్ మహమూద్ అలీ,కార్మిక ఉపాధి శాఖ మంత్రి సి హెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు ,శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ ,స్థానిక కార్పొరేటర్ జానకి రామరాజు ,తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లలితా జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం లో సోమజిగూడా తరవాత రెండో అతి పెద్ద షోరూం అని ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఇతర జిల్లాలోనూ మా లలితా షోరూంలు అందరికి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. న్యాయమైన విక్రయాలు, విస్తృతమైన కలెక్షన్ లతో పాటు, వినియోగదారులకు అవగాహన కల్పించి, నాణ్యత గల నగలు విక్రయించడం, పారాదర్శకమైన విధానాన్ని లలిత జ్యువెలరీ అనుసరిస్తోంది కాబట్టి వినియోగదారులకు మా పై నమ్మకం ఏర్పడిందని అన్నారు.