Andhra Pradesh
13 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రుల నియామకం
Kalinga Times, అమరావతి: ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా మంత్రిగా శ్రీరంగనాధరాజు, విశాఖ జిల్లాకు మోపిదేవి వెంకటరమణ, తూగోకు ఆళ్ల నాని, పగోకు పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణాజిల్లా కురసాల కన్నబాబు, గుంటూరు జిల్లాకు పేర్నినాని, ప్రకాశం జిల్లాకు అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లాకు సుచరిత, కర్నూలుకు బొత్స, కడపకు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, అనంతపురం జిల్లాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లాకు మేకపాటి గౌతమ్ రెడ్డిలను నియమించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.