Kalinga Times :ప్రతిరోజూ పూజలో పాటించవలసిన విధివిధానాల అనుసారం, పూజ చేయడంలో కొన్ని లోహాలను ఉపయోగించడాన్ని నిషేధించడమైనది. మనుస్మృతి లోని ఒక శ్లోకంలో పూజకు ఏ, ఏ లోహాలతో చేసిన సామాగ్రిని వాడరాదు తెలుపబడింది. అల్యూమినియం, ఇనుము లేదా కృత్రిమ లోహాలతో తయారు చేయబడిన పూజా సామాగ్రిని వినియోగించరాదు. అల్యూమినియంను రుద్దినప్పుడు నల్లని పొడి వంటి పదార్ధం ఏర్పడుతుంది. ఈ పొడి పూజలకు అపవిత్రమైనదిగా భావిస్తారు. కనుక, ఈ లోహాన్ని పూజల్లో వాడరాదు.
ఇనుము అనే లోహం, గాలితో లేదా నీటితో చర్య జరిపినప్పుడు, తుప్పు పడుతుంది. ఇటువంటి వస్తువులను పూజల కొరకు వినియోగించడం అశుభం ఉక్కు ఉక్కు అనుకూల శక్తిని అడ్డుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. వాతావరణంలోని సాత్విక తత్వాలు ఉక్కు అంత సులువుగా అందుకోదు. పైగా ప్రతికూల శక్తిని త్వరగా ఆకర్షిస్తుంది. కనుక ఈ లోహాన్ని పూజలకై వినియోగించరాదు.
మనుస్మృతి అనుసారం కృత్రిమంగా తయారు చేయబడిన లోహాలు లేదా సహజమైనవి కానీ మూలకాలను పూజలకు వినియోగించరాదు. ఇవి ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. పూజ గదిలో లేదా వాతావరణంలో ఉండే అనుకూల లేదా సాత్విక తత్వాలను ఇవి ఆకర్షించలేవు.
కనుక,రాగి లేదా ఇత్తడి వంటి సహజ లోహాలు వాడటం ఉత్తమం. మట్టి, వెండి, రాగి లేదా బంగారు పాత్రలు పూజ చేయడానికి విశిష్టమైనవని ప్రతీతి. ఈ సామాగ్రి ప్రతికూల అంశాలను ఆకర్షిస్తాయి. బంగారం మరియు వెండి ఖరీదైన లోహాలైనందున రాగి, ఇత్తడి లేదా రాతి సామాగ్రిని వాడటం మంచి ప్రత్యామ్నాయం పాత సామాగ్రి ఇంకా శుభకరమైనవి.
గుర్తుపెట్టుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, ఎంత పాత వస్తువయితే, అంత శుభప్రదమైనవి. పూజలకు వినియోగించే ఏ వస్తువైనా, పూజ గదిలో ఉండే అనుకూల దైవిక శక్తిని గ్రహిస్తాయి. సమయం గడిచేకొద్దీ, దేవుని విగ్రహాలు మనం చేసే పూజలు, వ్రతాలు మూలంగా దైవిక శక్తిని పొంది ఉంటాయి. కనుక ఆ పరిసరాల్లో ఉంచే ఏ వస్తువైనా, దైవికంగా మారుతుంది.
కనుక మనం పూజలకు పురాతన లోహ సామగ్రి వాడటం ఉత్తమం. అంతేకాక, దీపపు కుందెల వంటి పూజాసామగ్రి ఉదాహరణకు, సరస్వతి దేవి ముందు వెలిగించిన దీపాన్ని, గణపతికి కూడా వాడినట్లైతే, దానిలో భగవంతుని సాత్విక శక్తి ఉంటుంది కానీ, ప్రత్యేకించి సరస్వతి లేదా వినాయకునికి సంబంధించిన ధాతువు ఉండకపోవచ్చు. కనుక ఒక దేవుని పూజకు వినియోగించిన సామాగ్రిని వేరొక దేవుని పూజకై వినియోగించకపోవడమే మంచిది.