Telangana
ఢిల్లీవెళ్లే రైల్లో అక్రమ గంజాయి రవాణా
Kalinga Times : ఖమ్మం రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి న్యూ ఢిల్లీకి వెళ్లే రైల్లో అక్రమ గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను ఖమ్మం జీఆర్పీ పోలీసులు పట్టుకొని, 21.700 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.