National
రన్ వేపై స్పైస్ జెట్ ఫ్లైట్ అదుపు తప్పింది
ముంబై : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం ప్రభావం పలు విమాన సర్వీసులపై పడింది. సోమవారం రాత్రి స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులోని మెయిన్ రన్ వేపై స్పైస్ జెట్ ఫ్లైట్ అదుపు తప్పింది.జయపుర నుంచి ముంబైకి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ల్యాండయ్యే సమయంలో రన్ వే చివరకు దూసుకుపోయి బురదలో కూరుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మెయిన్ రన్‌వేను మూసివేసిన అధికారులు మరో రన్‌వే పై రాకపోకలు సాగిస్తున్నారు.