
kalinga Times, Mandamari :మా అనుమతి తీసుకోకుండా మా జాగలొకి వచ్చి పోటోలు తీస్తారా? కాళ్ళు చేతులు నరికేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న భూ మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ మందమర్రి ప్రెస్ క్లబ్ సభ్యులు రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణను మంగళవారం ఆయన కార్యాలయంలో కలసి ఫిర్యాదు చేశారు. ఈ సంధర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సంజీవ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత భూ అక్రమాలపై గత నెల వివిధ పత్రికలు,చానళ్ళలో వార్తా కథనాలను ప్రచురించి ప్రసారం చేయటం జరిగిందని తెలిపారు ఆ విషయమై భైరినేని రఘు , భూ యజమానులు ఆయా పత్రికా,వీడియో జర్నలిస్ట్ లపై బెదిరిపులకు పాల్పడటమే కాకుండా చంపేస్తామంటూ బహిరంగంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కమీషనర్ ను కోరినట్లు తెలిపారు.ఈ విషయమై సత్వరమే విచారణ జరిపి దొషులను శిక్షిస్తామని కమీషనర్ హామీ ఇచ్చినట్లు సంజీవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మందమర్రి జర్నలిస్ట్ లు శ్రీనివాస్,సలాం,సంపత్ లు పాల్గొన్నారు.