social
వారితో గడిపిన వీడియోలు పంపి బ్లాక్ మెయిల్
Kalinga Times : పశ్చిమ గోదావరి: మొగల్తూరు మండలం పేరుపాలెంలో మొబైల్ షాపు యజమాని అనిశెట్టి సాయి తన షాపునకు సెల్ ఫోన్ల రిపేర్ల కోసం వచ్చే యువతులను సాయి మాయ మాటలతో నమ్మించి లోబరుచుకున్నాడు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 61మంది ఆడోళ్లను వంచించాడు ఓ కామాందుడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో ఓ వక్తి సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అతని షాప్ కు మొబైల్ రిపేర్ కోసం మహిళలు, కాలేజ్ చేస్తున్న యువతులు వచ్చేవారు. వారితో మాటలు కలిపి వాళ్ల వ్యక్తిగత నెంబర్లు తీసుకునేవాడు. తరచూ వాట్స్ అప్ మెసేజ్ లు చేస్తూ దగ్గరై మాటలు కలిపేవాడు. దీంతో పాటే వక్తిగతంగా దగ్గరై శారీరక వాంచ కూడా తీర్చుకున్నాడు. ఏకంగా 61మంది ఆడవాళ్లను వంచించాడు.
సదరు మహిళలతో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి, వాటిని బాధిత మహిళలు, యువతులకు పంపి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడు. సాయి దగ్గర పనిచేస్తున్న యువకుడు కొన్ని అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో ఒక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి సాయితో పాటు పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక అయిదుగురు సభ్యుల ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.