National

అవినీతి రాజకీయాలే నీటి కొరతకు కారణం

ఇదే చెన్నై నగరం నాలుగేళ్ల క్రితం వరదల్లో

Kalinga Times : తమిళనాడులో నీటి కొరతకు కారణం అక్కడి అవినీతి రాజకీయాలే అంటే పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. దీనిపై అక్కడి రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కిరణ్ బేడీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “ఓ ప్రశ్నకు సరైన సమాధానం ఉంది. భారతదేశంలో ఆరో అతిపెద్ద నగరమైన చెన్నై నగరం నీటి కష్టాలు ఎదుర్కొంటున్న తొలి నగరంగా నిలిచింది. ఇదే చెన్నై నగరం నాలుగేళ్ల క్రితం వరదల్లో మునిగిపోయింది. సమస్య ఎక్కడుంది..? దీనికి సమాధానం ప్రభుత్వ వైఫల్యం, అవినీతి రాజకీయాలు, భిన్నమైన బ్యూరోక్రసీ” అని కిరణ్ బేడీ ట్వీట్ చేయడంతో రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. కిరణ్ బేడీ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతుండటంతో ఆమె స్పందించారు. తను ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని కిరణ్ బేడీ చెప్పారు. తన ట్వీట్ వ్యక్తిగతం కాదని చెప్పారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close