Nationalsocial

సింగిల్స్‌ తీస్తూ మ్యాచ్‌ని చేజార్చారా ? (వీడియో…)

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమికి ధోని-కేదార్ జాదవ్‌లే కారణమంటూ అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్లలో భారీ షాట్లకు పోకుండా కేవలం సింగిల్స్‌ తీస్తూ మ్యాచ్‌ని చేజార్చారని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం స్పందించాడు.


పిచ్‌ పరిస్థితుల దృష్ట్యానే వారి బ్యాటింగ్‌ నెమ్మదిగా అనిపించిందని, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ ధోని, కేదార్‌ జాదవ్‌ భారీ షాట్ల కోసం ప్రయత్నించారని కానీ స్లో పిచ్‌ కారణంగా సాధ్యం కాలేదని తెలిపాడు. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకే దక్కుతుందని… వారు పరిస్థితులకు అనుగుణంగా ఆడి విజయం సాధించారని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్‌కు వెళ్తుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close