చంద్రశేఖర్ రావు ముడనమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నేను న్యాయస్థానంలో ప్రజా వ్యాజ్యం వేసానన్నారు. పిచ్చిపట్టినట్టు ఏది పడితే అది కులగొడుతాం అంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అమరవీరుల స్తూపం కోసం కేవలం టెంకాయ కొట్టాడు అక్కడ తట్టెడు మట్టి తీయలేదు. భవనాలు కూలుస్తే, ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారకు ఊరుకొమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ భవనాల కూల్చివేత ను అడ్డుకోవడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇన్ని వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తానంటే ఊరుకొమన్నారు. త్వరలో దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని తెలిపారు. ఈ సచివాలయంలో ఏ భవనం కూడా 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించలేదు. ఇక్కడి భవనాలు 100 సంవత్సరాల కోసం నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సరిపోయింది సచివాలయం. ప్రస్తుతం సచివాలయ భవనాల విలువ 1000కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు కులుస్తున్నాడు. ప్రస్తుతం 400 కోట్లతో కడతానంటున్న చంద్రశేఖర్ రావు అంచనాలు పెంచుతారు. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానన్ చంద్రశేఖర్ రావు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు.
చంద్రశేఖర్ రావు కు చిత్త శుద్ధి ఉంటే విద్యార్థులకు భవిష్యత్తు కోసం నూతన విద్య భవనాలు నిర్మించాలన్నారు. అమరవీరుల స్తూపం ప్రపంచ వ్యాప్తంగా నిర్మిస్తానన్నాడు. అన్ని కులాలకు భవనాలు నిర్మిస్తానన్నాడు. లిటికేషన్ ఉన్న భూములు కేటాయించాడని విమర్శించారు. ప్రతిపక్షాలను అడిగి నిర్ణయం తీసుకోవాల్సి న అవసరం లేదు అంటున్న తలమాసిన శ్రీనివాస యాదవ్ కు అలుగడ్డలు అమ్మిన బుద్ధి ఇంకా పోలేదని తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు.