
Kalinga Times,అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహ తప్పిపడిపోయింది. సీఎంకు అర్జీ ఇచ్చేందుకు ఆమె తాడేపల్లికి వచ్చింది. సీఎం ఫిర్యాదులు తీసుకుంటారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోపలికి రావడంతో తోపులాట జరిగింది. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేటి నుంచి నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే ఆ విషయం తెలియని ప్రజలు సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరికి విషయం తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు.