
Kalinga Times :ప్రెస్ మీట్ల రాజకీయాలొద్దని పోరాటం చేయాల్సిన సమయమన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జుల సాగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ బాధ్యతగా రాజీనామా చేశారని, వారి బాటలోనే తానూ రాజీనామా చేశానన్న రేవంత్ ఇప్పుడు ప్రెస్ మీట్ల రాజకీయాలు నడవవని, ప్రజలోకి వెళ్లకుండా ప్రజల విశ్వాసం పొందలేమని, నిరంతరం ప్రజలలో ఉండి పోరాటం చేయాలన్నారు. సమావేశంలో చర్చించి బయటకు వెళ్ళగానే వదిలేస్తున్నారని, అమలుకు శ్రద్ద చూపనపుడు సమావేశాలు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు.