
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై కారు బైక్‌ను ఢీకొట్టి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడింది. ఈ ఘటనలో పత్రికా జర్నలిస్టు తాజుద్దీన్ మృతి చెందాడు. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పత్రికా జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ప్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు. మరోవైపు బైక్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతుడు కరీంనగర్ జిల్లా వాసీగా గుర్తించారు.కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో బీభత్సం సృష్టించడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని వాహనదారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.