social
ఇతర దేవుళ్ళతో నవ గ్రహాలను సమానంగా చూడొద్దా ?
Kalinga Times :నవ గ్రహాలకు ఇతర దేవుళ్ళతో సమానంగా ప్రాధాన్యతను ఇచ్చి పూజించడం కూడా సరైనది కాదని సూచించడమైనది. నవ గ్రహాలను, ముఖ్యంగా శివునికి సమానంగా పరిగణించటం ఒక పాపం. ఇలా చేసిన ఎడల మీకు శాపం కలుగుతుందని చెప్పబడుతుంది. దేవాలయంలో ఉన్నప్పుడు, మీరు ఇతర దేవతలను ఆరాధించిన తరువాత మాత్రమే నవ గ్రహాలకు మీ గౌరవాన్ని చెల్లించవలసి ఉంటుంది. పూజలు చేసేటప్పుడు, మొదటగా ఇతర దేవతలకు ప్రార్ధన చేసిన తర్వాతనే, నవ గ్రహాలకు పరిహరాన్ని చేయవలసి ఉంటుంది. శనివారం నాడు నవ గ్రహాలు చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేయడం మంచిదిగా సూచించబడుతుంది. కానీ, వారంలోని ఇతర రోజులలో అలా చేయటం తప్పుగా పరిగణించబడుతుంది.
మిగిలిన రోజుల్లో అనవసరంగా నవ గ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రజలపైన శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది. శనివారం మినహా మిగిలిన రోజులలో నవ గ్రహాలను పూజించేటప్పుడు, 9 మార్లు కాకుండా ఒకసారి మాత్రమే వాటి చుట్టూ తిరగడం ఉత్తమంగా చెప్పడమైనది.
నవ గ్రహాలను ప్రదక్షించునప్పుడు పఠిoచవలసిన మంత్రం
“ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ”
ఈమంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేసిన ఎడల, ఇతర అవాంచనీయ ఆలోచనలకు దూరంగా, కేవలం దేవుని మీదనే దృష్టి సారించేందుకు వీలవుతుందని చెప్పబడింది. ఏది ఏమైనా అపసవ్య దిశలో రాహువు మరియు కేతు గ్రహాల చుట్టూ తిరగకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారా రాహు కేతువుల దృష్టిని మీ మీద పడే అవకాశాలు ఉన్నాయని పండితులు సూచిస్తుంటారు.
శని దేవుని ఆరాధించేటప్పుడు మీరు శనికి ఎదురుగా నిలబడకూడదు.
నవ గ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు మీ చేతులను మడవకూడదని (చేతులు కట్టుకోవడం కూడదు) చెప్పబడింది.
ఇతరులతో లేదా మీలో మీరు మాట్లాడడం వంటివి చేయరాదు. ఇటువంటి చర్యలు ప్రతికూల ప్రభావాలను తీసుకొస్తాయని చెప్పబడింది.
నవ గ్రహాలు ముందు ఎన్నటికీ సాష్టాంగ నమస్కారాలు చేయరాదని గుర్తుంచుకోండి.
ఒక దీపం వెలిగించి ఉంటే, మరొక వ్యక్తి యొక్క దీపాన్ని మీ దీపం వెలిగించడానికి వినియోగించరాదు.