Telangana
పార్టీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే రాజీనామా
kalinga Times : రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానన్నారు. పార్టీలో పదవి లేకపోయినా కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. యువరాజు రాహుల్ స్ఫూర్తితో రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ కూడ రాజీనామా చేశారు.