
Kalinga Times : స్టార్ హీరోయిన్ ప్రియాంక, అమెరికన్ సింగర్ నిక్ జొనస్ జంట ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్ జొనస్ తమ్ముడు జోయ్ జోనస్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. జోయ్ జోనస్, సోఫీ టర్నర్‌ల వివాహం జూలై 1న పారిస్‌లో జరగనుంది. రీసెంట్‌గా అందరూ కలిసి యాట్చ్(పెద్ద బోట్)లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆ సమయంలో ఆ యాట్చ్ చివరలో ఉన్న ప్రియాంక జారిపడబోయింది. అయితే పక్కనే ఉన్న ఆమె భర్త నిక్ జొనస్ ఆమెను పట్టుకుని ఆపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.