అమరావతి – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును బెదిరిస్తున్న వీడియోను మాజీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ వీడియోపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాక్షస రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటో ఊహించుకోవాలని పేర్కొన్నారు. లోకేష్ ఈ సందర్భంగా ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి వినొద్దనీ, ఇందులో అసభ్య పదజాలం ఉందని సూచించారు.
ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి..
*దయచేసి కుటుంబ సభ్యులతో ఈ అసభ్య పదజాలం వినకండి pic.twitter.com/C7eTvr2QGa
— Lokesh Nara (@naralokesh) June 28, 2019