social
విండీస్ పై భారత్ 125 పరుగులతో విజయం
Kalinga Times : విండీస్ పై భారత్ 125 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ పరాజయంతో విండీస్ వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. విండీస్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కోహ్లీ, ధోనీ హాఫ్ సెంచరీలతో రాణించారు. 269 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. విండీస్ ఇన్నింగ్స్ లో హయ్యస్ట్ స్కొరర్ 31 పరుగులు చేసిన అంబ్రిసే అవ్వడమే ఆ జట్టు బ్యాటింగ్ పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 32.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీ4, బుమ్రా 2, కుల్దీప్, పాండ్యా చెరొక వికెట్ తీయగా చాహల్ కు రెండు వికెట్లు దక్కాయి. భారత స్కిప్పర్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత వికెట్ల పతనాన్ని అడ్డుకుని నిలకడగా ఆడి 72 పరుగుల చేసిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.