Andhra PradeshTelangana
విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల ఉంచి సీఎం కేసీఆర్ నివాళులు
Kalinga Times హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవదేహాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. నానక్‌రామ్‌గూడలోని నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్ విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. విజయనిర్మల మరణానికి గల కారణాలు కుటుంబసభ్యుల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు.
సినీ రంగానికి విజయనిర్మల చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను సీఎం ఓదార్చారు. సీఎం వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, టీఆర్‌ఎస్ నేత కేశవరావు విజయనిర్మలకు నివాళులర్పించారు