Andhra Pradeshsocial
విజయనిర్మల అంత్యక్రియలు రేపు

Kalinga Times : విజయనిర్మల భౌతిక కాయాన్నినానక్‌రామ్‌గూడలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. విజయనిర్మల అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. భార్య భౌతిక కాయాన్ని చూసిన కృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను మహేష్ భార్య నమ్రత ఓదార్చారు. విజయనిర్మల భౌతికకాయానికి జయసుధ నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఆదిశేషగిరిరావు, మురళిమోహన్, రాఘవేంద్రరావు, కైకాల సత్యనారాయణ, మండలి బుద్ధప్రసాద్ తదితరులున్నారు.