National
విమానానికి బాంబు బెదిరింపు
Kalinga Times :ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా లండన్‌లో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని స్టాంట్‌స్టిట్ ఎయిర్ పోర్టు అధికారులు కూడా ధ్రువీకరించారు. బాంబు బెదిరింపు ఎయిర్ ఇండియా ఏ1 191 సర్వీస్ ఫ్లైట్ ముంబై నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో గల నెవార్క్ విమానాశ్రయానికి ఇవాళ ఉదయం బయల్దేరింది. అయితే ఆ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని మార్గమధ్యలోనే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో విమాన సిబ్బంది లండన్ స్టాంటిస్టిట్ ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడ అధికారుల అనుమతితో విమానాన్ని ల్యాండ్ చేశారు. అంతేకాదు ఎయిర్‌పోర్టును కడూా మూసివేశారు. ఎయిర్ ఇండియా విమానం ల్యాండయ్యాక రన్ వేను పూర్తిగా మూసివేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు సమాచారం అందించారు. విమానాన్ని తనికీ చేశాక .. తర్వాత రన్ వేను పునరుద్ధరించినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి
Air India flight #AI191 just diverted to Stansted due to a bomb threathttps://t.co/XzwA9pssoa pic.twitter.com/udBo2K8ADY
— Flightradar24 (@flightradar24) June 27, 2019