
నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి వద్ద గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెంది ఎన్. రాజేశ్వర్ కుటుంబం చాలా కాలంగా వనస్థలిపురం హైకోర్టు కాలనీలో నివాసం ఉంటుంది. రాజేశ్వర్ కుటుంబంలో పాపకు అక్షరాభాస్యం చేయించేందుకు ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా బాసరకు బయలు దేరారు.
వీరు ప్రయాణీస్తున్న కారు అడ్లూరు ఎల్లారెడ్డి వద్దకు చేరుకోగానే డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారితో పాటు ఆమె తండ్రి మరోకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.