Telangana

ధరూర్ మండలం ర్యాలంపాడులో దారుణ హత్య

తలారి పోస్టు కోసం తగాదాలు‌

Kalinga Times : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన తాయన్న తలారిగా విధులు నిర్వహిస్తుండేవారు. ఆయన మృతి చెందడంతో ఆయన ఉద్యోగం అతని కుమారుడు రాజు నిర్వహిస్తున్నాడు. తాయన్న సోదరుడు కుమారుడు కూడా తలారి ఉద్యోగం మాకే ఇవ్వాలని పలు మార్లు ఘర్షణకు దిగ్గినట్లు మృతుడ్ని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘర్షణ రాను రాను కక్ష పెంచుకున్నాడు. ఈ రోజు ఉదయం ధరూర్ నుంచి ర్యాలంపాడుకు వెళ్లిన రాజు అక్కడ అందరిని పలకరించి తిరిగి ధరూర్ కు తన ద్విచక్రవాహనం మీదుగా వస్తుంటే కాపు కాసుకొని వేటకొడవళ్లతో వెంకటన్న అనే వ్యక్తి తలపై వేటు వేయడంతో మృతి చెందాడు. చంపిన వ్యక్తిని పట్టుకోవడానికి గ్రామస్తులు ప్రయత్నించగా కొడవలితో భయపెట్టి అక్కడ నుంచి పారిపోయాడు. పట్టపగలే హత్య జరుగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. హత్య విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ‌ ఎం.రాము సర్ తన సిబ్బందితో సంఘటన‌స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బంధోబస్తు చేశారు. పూర్తి సమాచారం గద్వాల సిఐకి హనుమంతు తెలుపడంతో సిఐ కూడా సంఘటన స్థలానికి చేరుకుని.హత్య గల కారణాలు స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close