
రంగారెడ్డి (కళింగ టైమ్స్ ప్రతినిధి) తొమ్మిది నెలల చిన్నారి ని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఆగంతకుడిని వెంటనే ప్రభుత్వం స్పందించి ఉరిశిక్ష విధించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఇలాంటి అఘాయిత్యాలు రోజుకు ఒకటి జరుగుతున్న ప్రభుత్వం తనకు పట్టనట్లు వ్యవహరించడం సమంజసం కాదన్నారు, శనివారం కల్వ సుజాత గుప్తా కళింగ టైమ్స్ తో మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అభంశుభం ఎరుగని చిన్నారి పాప లపై కన్నుమిన్ను ఎరగని ఆగంతకులు పైశాచికత్వానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు,రోజుకొక సంఘటన ఇలాగే జరిగితే ప్రజలే అఘాయిత్యాలకు పాల్పడిన దుండగులను నడిరోడ్డు పైన ఉరిశిక్ష వేసే రోజుల సనమ్ అయ్యాయని ఆమె స్పష్టం చేశారు, దోషిని జైలుకు పంపి పోలీసులు కాపలా కాస్తున్నారని అలాంటి దోషికి శిక్ష పడటానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు,