
Kalinga Timesమలేషియా దేశం నందు నిర్వహిస్తున్న తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన చింట వెంకట్ క్రీడా కారుడు ఎంపికయ్యాడు.అతనికి కావలసిన ఇతర ఖర్చులు మరియు విమాన ప్రయాణ ఖర్చులకు, నాగర్ కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నుండి వెల్ఫేర్ స్కీం నుండి 60,000 రూపాయల చెక్కును జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి అతనికి అందించారు. అదే విధంగా జిల్లాలో సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం కలిగి ఉన్న క్రీడాకారులు ఎవరైనా విదేశాల్లో నిర్వహించే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు, క్రీడాకారులు ఆసక్తిగా ఉంటే వెళ్ళేందుకు వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నుండి అందిస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు.