
రంగారెడ్డి,కళింగ టైమ్స్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం గూడు కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప పథకం పేరిట ఇండ్లు నిర్మించి0ది,అయితే అసలైన లబ్ధిదారులు రాజీవ్ గృహకల్ప లో లేరు నూటికి 75% అక్రమాలకు గురి చేసుకుని అదే ఇళ్లలో జీవిస్తున్నారు,ఇందులో ఎక్కువ శాతం ధనవంతులు మాత్రమే ఉన్నట్లు సమాచారం,ఈ ఇండ్లలో పేదలు నివసిస్తూ ఉంటే నాలుగు నుండి ఆరు లక్షల వరకు నీడను కల్పించిన ఇళ్లనే అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు,మరికొంతమంది ఇండ్లు ఉండగానే మా ఇంట్లో జనాభా ఎక్కువగా ఉందని స్థానిక పాలకులకు చెప్పి ప్రభుత్వ అదనపు స్థలాన్ని ఆక్రమించుకుని అదనపు గదులను నిర్మించుకున్నారు,ఇలాంటి విషయాలను ఇక్కడ తెలియకుండా లోపట నొక్కి పట్టి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడంతో రాజీవ్ గృహకల్పలో స్కూల్ బస్సులు మళ్లడానికి కూడా రావడం లేకుండా పోయింది,ఇండ్లలో ఎక్కువశాతం 1 నుండి 4 గంటల వరకు ఆక్రమించుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది,ఇలాంటి ఇండ్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు,ఇల్లు లేని వారికి అసలు ఇల్లే లేకుంటే మా ఇంట్లో చాలా మంది ఉన్నారు ఎక్కువ సంఖ్య పెరిగిపోతోందని మాయమాటలు చెప్పి స్థలాలను కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటున్నారు,ఈ విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి పోకుండా లో లోపట రాజకీయ నాయకుల మధ్య లోనే తతంగం నడుస్తున్నట్లు తెలిసింది,ఎవరు దోచుకున్నంత వారికి తోచినంత లాభం అన్న చందంగా ఇక్కడి ప్రజలు వ్యవహరిస్తున్నట్లు సమాచారం,ఇలాంటి పరిస్థితుల్లో రోజురోజుకు ఇలాగే జరిగితే రాజీవ్ గృహకల్ప పేరు అన్యాక్రాంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి,ఇప్పటికైనా అసలైన లబ్ధిదారులను గమనించవలసిన అవసరం చాలా ఉంది