Andhra PradeshTelangana
ఘనంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
Kalingatimes : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. జలహోమం నిర్వహించిన తర్వాత… ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీ ఒకటో నంబర్ గేటును ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు.
సీఎం కేసీఆర్ తర్వాత… గవర్నర్ నరసింహన్ రెండో నంబర్ గేటును.. జగన్- ఫఢ్నవీస్ లు మూడు, నాలుగో నంబర్ గేట్లను స్విచ్ ఆన్ చేసి ఎత్తారు. రిబ్బన్ కటింగ్ చేశారు.
ఉదయం 9.30 గంటల సమయంలో ఏపీ సీఎం జగన్.. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మేడిగడ్డకు చేరుకున్నారు. హోమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్‌లో ఆరో నంబరు మోటార్‌ను సీఎం కేసీఆర్ స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర… 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు.
అంతకుముందు కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హోమం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు. పూర్ణాహుతి తర్వాత కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం డిస్ర్టిబ్యూటరీ సిస్టం వద్దకు వెళ్లి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్‌కు గోదావరి జలాలు వెళ్లడాన్ని పరిశీలిస్తారు. కాగా.. 4 గంటలకు కేసీఆర్, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు తిరుగు పయనమవుతారు.
ఉద్యమ సమయంలో చివరి దశలో స్వర్గీయ ప్రొ॥ జయశంకర్ సార్, సాగునీటిరంగ నిపుణులు, రిటైర్ట్ ఇంజినీర్ స్వర్గీయ విద్యాసాగర్ రావు లతో కలిసి తెలంగాణ ఏర్పాటు అనంతరం సాగునీటి రంగంలో తీసుకోవాల్సిన చర్యలు ప్రాజెక్టుల నిర్మాణం, ఎలాగైతె తెలంగాణ ప్రతి ఎకరాకు నీరందుతుంది, తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలి అనేదానికి అనేక చర్చోపచర్చలు, మేధో మథనం చేశారు కెసిఆర్. తెలంగాణ రైతాంగం బ్రతుకుల్ని మార్చాలనే సంకల్పంతో కెసిఆర్ ఆలోచనల నుండి ఉద్భవించినదే “కాళేశ్వరం ప్రాజెక్ట్” రేపటి తెలంగాణ భవిష్యత్ ఈ ప్రాజెక్ట్. దీని నిర్మాణం ఆశామాషీగా జరగలేదు.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ఇది నిలించింది. ఇది అంకుటిత దీక్షకు దక్కుతున్న ఫలితం. సమైక్య పాలనలో ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తే అది పూర్తవ్వాలంటే దశాబ్దాలు గడవాల్సిందే ఐనా పూర్తైనా దిక్కులేదు. కార్యదీక్ష, పనిపట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంతటి కార్యమైనా రుజువవుతుందని కెసిఆర్ నిరూపించారు. అతితక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారు.
ఈ ప్రాజెక్ట్ 2016 జూన్ నెలలో ప్రారంభించారు. ప్రారంభించగానే చకచక పనులు మొదలెట్టారు. ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉద్యమంలో కెసిఆర్‌తో కలిసి పనిచేసిన, మేనల్లుడు తన్నీరు హరీష్ రావును నియమించారు. కెసిఆర్ మార్గదర్శకంలో ప్రాజెక్ట్ పనులను హరీష్ వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను పాటిస్తూ ప్రాజెక్ట్ వద్దే సమీక్షలు నిర్వహిస్తూ, అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటూ పనులను పరిశీలిస్తూ పనులను వేగవంతం చేశారు. ఒక దశలో కెసిఆర్, హరీష్ రావుల పేర్లు కాళేశ్వర్ రావు లుగా గవర్నర్ నరసింహన్ అభివర్ణించారంటే ఈ ప్రాజెక్ట్ పట్ల వారి నిబద్ధత అకుంటిత దీక్ష అర్ధం చేసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి తగాదాలు లేకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర పడ్నవీస్‌తో ముందుగానే “జల ఒప్పందం” చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇది చరిత్రాత్మకం
ప్రాజెక్ట్‌కు కావాల్సిన అన్ని అనుమతులు సాధిస్తూ, ప్రతిపక్షాల కుట్రలను ఛేదిస్తూ, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతంగా ముందుకు నడిపిస్తూ నేడు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మోటార్లు ఈ ప్రాజెక్ట్‌కు వాడారు. మూడు బ్యారేజ్‌ల నిర్మాణం, మూడు పంపుహౌస్ ల నిర్మాణం, కిలోమీటర్ల కొద్ది సొరంగాలు, కాల్వలు చేపట్టి ఒక ఇరిగేషన్ వండర్‌గా దీన్ని నిలిపారు. 7152 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థతో దేశంలోనే అసాధారణమైన ఎత్తిపోతల ప్రాజెక్టును అతి కొద్ది సమయంలో నిర్మించి తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు గులాబీ బాస్. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకి కాళేశ్వరం ప్రాజెక్ట్ జీవం పోస్తుంది అంటే దాదాపు తెలంగాణ రైతాంగం అంతా చిరునవ్వులు చిందించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ లో జరిగిన కాంక్రీట్ పనులు రికార్డ్ సృష్టించాయి. ముఖ్యమంత్రి సంకల్పం, అద్భుత పర్యవేక్షణ, మంత్రిగా హరీష్ కృషి వెరసి దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది.నాడు కరువు పాటలు పాడిన చోట, కన్నీళ్ళతో బ్రతుకులెల్లదీసిన చోట కాళేశ్వర నీళ్ళతో రైతు కన్నీళ్ళు పోయి ఆనందం రాబోతోంది.