social
అసభ్యకర దుస్తులతో రియాల్టీ షో
KALINGA TIMES ; గత కొన్నేళ్లుగా ఛానెళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోయాయి. టీవీ రియాల్టీ షోలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ ఛానల్స్‌కు కొన్ని ప్రత్యేక మార్గ దర్శకాలను జారీ చేసింది. రేటింగ్స్ కోసం షో నిర్వాహకులు చిన్నారులతో అసభ్యకర దుస్తులను వేసి డాన్స్‌లు చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు శృతి మించి పోతున్నాయని, పైగా షోలో గెలవాలంతూ వారిపై తెస్తున్న వత్తిడి కారణంగా చిన్న పిల్లలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నట్టు బాలల హక్కుల సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేబుల్ చట్టం-1995 ప్రకారం ఛానళ్లు నిబంధనలను అనుసరించాల్సిందేనని, రియాల్టీ షోలలో అసభ్యకరమైన భాష వాడినా, కఠినతరమైన సన్నివేశాలను చూపించిన చర్యలకు దిగుతామని పేర్కొంది. చిన్నారులతో అనుచిత సన్ని వేశాలు, నృత్యాలను చేయిండంపైనా తన అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వివిధ ఛానల్స్ చిన్నారులపై చేస్తున్న వత్తిడి కారణంగా వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, వాటి పర్యావసానాలు ఎటువైపుకు దారి తీస్తాయో అని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.