KALINGA TIMES : అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందుతున్న చిత్రం ‘ఆడై’… రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగులో ‘ఆమె’ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో అమలా పాల్ పూర్తి నగ్నంగా కనిపించడం సంచలనం రేపుతోంది.
ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య గురించి చర్చిస్తూ ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. అయితే టీజర్లో పూర్తి క్లూ ఇవ్వలేదు. మహిళలకు స్వేచ్ఛ ఏమేరకు ఉంది? స్వచ్ఛ లభించిన వారు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది. పోస్టర్లో అమలా పాల్ న్యూడ్‌గా ఉండటం చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. కొందరు ఆమెపై చాలా దారుణమైన, అసభ్యమైన కామెంట్స్ చేశారు.
‘ఆమె’ మూవీకి రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ‘వి స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.