National

తెలంగాణ ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం

కళింగ టైంస్ న్యూఢిల్లీ ; సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన ఎంపీలు ఈ రోజు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్‌) నుంచి 9 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీకైన స‌భ్యులు ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేతకాని తొలుత ప్రమాణం చేయగా. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ (బీజేపీ), నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ ధర్మపురి (బీజేపీ), బీబీ పాటిల్‌ (టీఆర్ఎస్), కొత్త ప్రభాకర్‌ రెడ్డి (టీఆర్ఎస్‌), రేవంత్‌ రెడ్డి (కాంగ్రెస్), అసదుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), రంజిత్‌ రెడ్డి (టీఆర్ఎస్‌), మన్నె శ్రీనివాస్‌ రెడ్డి (టీఆర్ఎస్‌), పోతుగంటిరాములు (టీఆర్ఎస్‌), ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్), పసునూరి దయాకర్‌ (టీఆర్ఎస్), మాలోతు కవిత (టీఆర్ఎస్), నామా నాగేశ్వర్‌రావు (టీఆర్ఎస్‌) లు వరుసగా తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం చేసి రిజిస్ట్రార్‌లో సంతకాలు చేశారు. కొత్త ఎంపీల్లో వెంకటేష్‌ నేతకాని, బండి సంజయ్‌ కుమార్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు తెలుగులో ప్రమాణం చేయగా అరవింద్‌ ధర్మపురి, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంగ్లీష్‌లో, బీబీ పాటిల్‌, అసదుద్దీన్‌ ఒవైసీ హిందీలో ప్రమాణం చేశారు. అస‌దుద్డీన్ ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో జై శ్రీ‌రామ్, వందేమాత‌రం అంటూ నినాదాల‌తో స‌భ హోరెత్తింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close