Andhra PradeshTelangana
నారాయణ, చైతన్య సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు
KALINGA TIMES ; హైదరాబాద్: తప్పుడు ర్యాంకులతో తెలుగు ప్రజలను మభ్యపెడుతూ మోసాలకు పాల్పడుతున్న నారాయణ, చైతన్య విద్యాసంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమీషనర్ కు హై కోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ నేత ఫిర్యాదు చేశారు . ఈ సంధర్భంగా దిల్ సుక్ నగర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు . భాస్కర్ నేత మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య వచ్చిన ఐఐటి, నీట్, ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఘోరంగా మోసం చేస్తూ విద్యాసంస్థలు తమ పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు, ఇతర సంస్థకు చెందిన విద్యార్థి ర్యాంకులతో నారాయణ, చైతన్య సంస్థలు ప్రచారం చేసుకుంటూ మా విద్యార్థి యే ర్యాంకులు సాధించారంటూ పెద్ద పెద్ద ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఒక విద్యార్థి ఒకే ర్యాంకును సాధించకుండా, వివిధ సంస్థల నుండి నాలుగైదు ర్యాంకు సాధించడం ఎలా అని ప్రశ్నించారు . సుమారుగా రెండు విద్య సంస్థల నుండి 50 మంది విద్యార్థులు మూడు నాలుగు ర్యాంకులు వచ్చినట్లుగా ప్రకటించుకున్నారు. తక్షణమే ఈ తప్పుడు ర్యాంకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ కమిషనర్ కు, జాతీయ మానవ హక్కుల కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు