Film
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా రష్మిక
KALINGA TIMES : రష్మిక మందన్న వరుస సినిమాలకు కమిటవుతూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ భామ.. తాజాగా ఓ సెక్సీ లుక్‌తో అట్రాక్ట్ చేసింది. షర్ట్ కిందకు లాగేసి.. అయితే ఈ ఫోటోపై ఎలాంటి క్యాప్షన్ పెట్టకుండానే కేవలం కంటి చూపుతోనే పడేసింది ముద్దుల పాప రష్మిక. జబ్బలపై ఉన్న షర్ట్ కిందకు లాగేసి లోపలి అందాలతో అట్రాక్ట్ చేసేసింది. ముద్దు సీన్లే కాదు అందాల ఆరబోతకు కూడా తాను వెనుకాడనని ఈ పిక్ ద్వారా చెప్పకనే చెప్పింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణం గానే రష్మికకు ఫాలోవింగ్ ఎక్కువ. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఆమెను తెగ ఫాలో అవుతూ ఉంటారు. నాచురల్ లుక్స్ తోనే సెన్సేషనల్ అయ్యే ఈ భామ.. తాజాగా సెక్సీ లుక్ పోస్ట్ చేయడంతో లైకులు, కామెంట్లకు కొదవే లేదు. ఈ పిక్ పెట్టిన 10 నిమిషాల్లోనే వేళల్లో లైకులు వచ్చేశాయి. ఇక ఈ పిక్ పై ”ఎక్స్‌ప్రెషన్ క్వీన్.. పిచ్చెక్కించింది, నాచురల్ బ్యూటీ, రష్మిక కేవు కేక” అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. విజయ్ దేవరకొండతో ముద్దుల లోకంలో గతంలో ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్స్ చేసి ఆకట్టుకున్న ఈ పాప.. మరోసారి ‘డియర్ కామ్రేడ్ ‘ సినిమాలో అదే హీరోతో తెగ రొమాన్స్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ విజయ్, రష్మిక మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయో తెలిపింది. జులై నెలలో ‘డియర్ కామ్రేడ్ ‘ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలా వచ్చి రాగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టే అరుదైన అవకాశం పట్టేసింది రష్మిక.