Telangana
వాగ్దానాలల్లో ప్రతి ఒక్కటి నెరవేరుస్తా -ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
KALINGA TIMES : కె పి హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని వార్డ్ ఆఫిస్ లో కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు ఆద్వర్యం లో , కాలనీ అసోసియేషన్ సభ్యులతో,కూకట్పల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య,టౌన్ ప్లానింగ్ ,వాటర్ వర్క్స్ ,హౌసింగ్ బోర్డు అధికారుల సమక్షం లో కాలనీ లో గల పలు సమస్యల పై కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశం లో కాలనీ ప్రజలు ప్రధానంగా తాగు నీటి సమస్య ,రోడ్లు ,డ్రైనేజీ ,మరియు పార్కుల సమస్యలు పరిష్కరించాలని కోరగా,వెంటనే ఆ సమస్యల పై ఆయా అధికారులకు పలు సూచనలు చేసి సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఆయా అధికారులను ఆదేశించడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ,రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి వచ్చే నీటి ద్వారా త్రాగు నీటి సమస్య పూర్తిగా తీరిపోతుంది అన్నారు .
అలాగే నీటి సమస్య కు ప్రధాన కారణం నీటి సరఫరా అయ్యే జలాశయాలలో నీరు తగ్గి పోవడం , ఒక్క హౌసింగ్ బోర్డు కాలనీ లోనే 1000 నుండి 12 వందల హాస్టళ్లు ఉన్నాయ్ వాటర్ వదలగానే మోటార్ లతో లాగేస్తూ ఉంటె రసర్వాయర్లు కాళీ అయిపోతున్నాయి ,ఆ పద్దతి మానుకోవాలని ,అలాగే 70 గజాలు 100 గజాల స్థలాల్లో 4 నుడి 5 అంతస్తులు వేస్తున్నారు ఇలాంటి అక్రమాలు జరక్కుండా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు అదేశించడం జరిగింది ,అలాగే ఆసియా లోనే అతి పెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ కి ఫైర్ స్టేషన్ గత పాలకులు తెలేకపోయారు అతి తొందర్లోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గత ఎన్నికల్లో మీరంతా నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించడం జరిగింది నేను ఇచ్చిన వాగ్దానాలల్లో ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని అన్నారు పేద వారి కోసం జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.