Film
‘ఇస్మార్ట్ శంకర్’ రొమాన్స్ డోస్ బాగా పెంచేశారు
KALINGA TIMES : ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ మొదలుపెట్టి దిమాక్ ఖరాబ్ అనే లిరికల్ సాంగ్ వదిలి యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ పాటలో నిధి అగర్వాల్, నభా నటేష్ అందాలు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చిందులు కుర్ర హృదయాలను మాయ చేశాయి. ఇలా ఆడియన్స్ దిమాక్ ఖరాబ్ చేస్తూ తమ సినిమాపై హైప్ క్రియేట్ చేసుకున్నారు టాలెంటెడ్ పూరి అండ్ ఛార్మి. ఇది చాలదన్నట్లు డోస్ పెంచి రొమాన్స్ ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ పాటతోనే ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేసిన వీళ్ళు.. ఇది చాలదన్నట్లు డోస్ పెంచి మరో పాట విడుదల చేశారు.
‘జిందాబాద్ జిందాబాద్’ అంటూ రామ్, నభా నటేష్ ల మధ్య సాగే ఒక రొమాంటిక్ సాంగ్ ఇది.మాల్దీవ్స్ లోని బీచ్ లొకేషన్ లో చిత్రీకరించిన ఈ పాటలో రొమాన్స్ డోస్ బాగా పెంచేశారు. శరత్ సంతోష్, రమ్య బెహరా పాడిన ఈ పాటలో నభా నటేష్ అందాలు అబ్బుర పరుస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు ”డబుల్ దిమాక్” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో ఛార్మి, పూరి జగన్నాథ్ నిర్మాణంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. జులై 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.