Telangana
అతి తక్కువ ఖర్చు తో ప్రజలకు వైద్యం
KALINGA TIMES : రాందేవ్ రావు హాస్పిటల్ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందిస్తున్న విషయం అందరికి విదితమే. ఆసుపత్రి నుంది దూర ప్రాంతాలలో ఉండే ప్రజలందరికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ యాజమాన్యం, అయిత రాజు ఫౌండేషన్ మరియు ఎసెంసీయల్ మెడికల్ సర్వీసెస్ వారు కలిసి ”టెలి మెడిసిన్” సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ మూడు సంస్థలకు సంభందించిన ప్రతినిధులు అధికార ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మరొక విశిష్ట కార్యక్రమానికి కూడా నాంది పలకడం జరిగింది . ఈ.ఎం.ఎస్ వార్షిక ఆర్ధిక సహాయంతో ఇరవై లక్షలు వైద్య రంగంలో వివిధ విభాగాలకు పార మెడికల్ స్టాఫ్ కు శిక్షణ ఇచ్చేoదుకు ”స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్” ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో శివానంద రిహబిలిడేషన్ ప్రెసిడెంట్ విక్రంధవ్ రావు , సెక్రెటరీ మీరా రావు,అయిత రాజు ఫౌండేషన్ నుంచి డా౹౹ భరత్ బాబు, బండారు రామచంద్ర రావు, జ్వాల నరసింహారావు మరియు ఈ.ఎం.ఎస్ నుండి డా౹౹ నాగభూషణం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా౹౹ తొరు దయాకర్, పత్రిక విలేకరులు మరియు ఫ్రెండ్స్ అఫ్ రాందేవ్ మెంబర్లు ప్రభాకర్, సురేష్, టి. ఎల్ రెడ్డి మరియు శ్రీనివాస్ గార్లు అలాగే హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు