హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణా లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హెచ్సిఎల్ వారు “టెక్ బి” పేరుతో ఇంటర్మీడియెట్ లేదా పన్నెండు వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సరైన అవకాశాన్ని కల్పించనున్నారు. కేవలం ఇంటర్మీడియట్ పాసవడం తోనే ప్రవేశ పరీక్ష వ్రాసి అందులో ఉత్తీర్ణ శాతాన్ని బట్టి ఎంపిక చేసి, ఒక సంవత్సరం తగు శిక్షణ ఇచ్చి వారి కంపెనీలోనే వివిధ టెక్నాలజీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని ఎచ్సిఎల్(HCL) ఎక్స్క్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలియజేశారు.
ఈ ప్రోగ్రామింగ్ అనేది జూలై చివరి వారం నుంచి మొదలు మొదలుపెడతామని ఈ అవకాశము గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో అందరికి అందుబాటులో ఉంటుందని, కేవలం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై సైన్సు మరియు కామర్స్ విద్యార్థులకు కలదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీమతి శివశంకర్ మరియు ఇతర ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు