Telangana

4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌

KALINGA TIMES :నగరంలోని హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహా సముదాయాలను ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఏరువాక పౌర్ణమి నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నివాస గృహాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్‌ గృహవాస్తు పూజలు చేయనున్నారు. మొత్తం 4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో 12 అంతస్తులతో 120 క్వార్టర్లను నిర్మించారు. 2100 చదరపు అడుగుల ప్రతి క్వార్టర్‌లో 3 బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది, 36 మంది సిబ్బందికి కూడా గదులను కేటాయించనున్నారు. ఈ ప్రాంగణంలోనే బ్యాంకు, క్లబ్‌ హౌజ్‌, సూపర్‌ మార్కెట్‌ నిర్మించారు. 240 వాహనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సందర్శకులతో సమావేశాలకు 23 గదులు ఏర్పాటు చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close