
KALINGA TIMES :ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాలు త్వరలోనే 25 జిల్లాలు కాబోతున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం జరుగుతోందని… ఇందులో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయని విజయసాయి చెప్పారు. పాదయాత్ర సమయంలో జగన్ అనేక హామీలను ఇచ్చారని… వాటన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పార్టీ కార్యకలాపాలు ఇటీవల తగ్గిపోయాయని అందరూ అనుకుంటున్నారని… పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి అమరావతికి తరలిస్తున్నామని… కొత్త కార్యాలయం ఏర్పాటు కాగానే పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని చెప్పారు. ప్రతి శని, ఆదివారాల్లో కార్యకర్తలకు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.