Telangana
అభాగ్యురాలికి పెన్షన్ మంజూరు చేయండి సారు..
రంగారెడ్డి, కళింగ న్యూస్ ప్రతినిధి: గత ఏడు సంవత్సరాల నుండి పింఛను మంజూరు చేయాలని ఒక అభాగ్యురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది, అయినా కనికరించని జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఇలాంటి సమస్య ఎక్కడ జరగలేదు, శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న సాధన అనే ఓ వృద్ధురాలు పింఛన్ కోసం స్థానిక నాయకులను వేడుకుంది, అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో కళింగ న్యూస్ టైమ్స్ కు మొరపెట్టుకుంది, వెంటనే ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది స్పందించి అభాగ్యురాలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆమె కోరింది