Filmsocial

ఏది మంచిదో నిర్ణయించవలసింది మనమే

మనసు దేనినైనా కోరు కోవచ్చు. ఆ శక్తి మనసుకు ఉంది. కాకపోతే, మనసు కోరేది మనకు అవసరమా? కాదా? అనేది నిర్ణయించవలసింది మనమే గాని మనసు కాదు. మనకు ఏది మంచిదో దానిని మనస్సు కోరలేకపోవచ్చు. కాని, మనస్సు కోరుకునే వాటిలో ఏది మనకు మంచిదో దానినే మనం ఆశించాలి. అనుభవానికి అందిన, అందుతున్న విషయాలనే మనసు ఆలోచించగలుగుతుంది. మన అనుభవాలన్నీ అందమైనవని, ఆనందప్రదమైన వని చెప్పలేం. మన ఆలోచనా విధానంలో తయారైన దృఢసంకల్పాలే అనుభవాలు.

ముక్కువాసనను గ్రహిస్తుంది.అది మల్లెల వాసన అనే విషయాన్ని మనస్సు తెలుసుకుంటుందే గాని ముక్కు చెప్పలేదు. ఆ వైపుగా వెళ్లి మనం మల్లెలను కోస్తే, దానికి కారణం మనసే గాని ముక్కు కాదు. ఏదైనా అంతే. కళ్లు రూపాల్ని చూచినా, చెవ్ఞలు శబ్దాలను విన్నా, అవన్నీ పరికరాలు మాత్రమే. పనితనమంతా మనసుదే. కళ్లు చూచిన ప్రతి వస్తువ్ఞ వెంట మనసు పరుగుపెట్టనవసరం లేదు. కాని, మనసు చూడాలనుకున్న దానిని చూడకుండా ఆపే శక్తి కంటికి లేదు. చూచేందుకు కళ్లు ఉపయోగపడవచ్చు. చూడవలసింది మాత్రము మనసే. నేత్రాది ఇంద్రియాలకు ఏవేవో అందుతూ ఉంటాయి.

అవన్నీ మనసుకు అవసరం లేదు. కనుక ఇంద్రియా లను మనస్సుఅనుసరించనవసరం లేదు. మనస్సుకు అవసరమైనవి ఏవో, వాటివైపు ఇంద్రియాలు నడుస్తాయి. అయితే, మనస్సుసంకల్ప ప్రవాహమే కనుక, మనకు ఏమి కావాలో దానిని మనసు నిర్ణయించలేదు. మనం నిర్ణయించాలి. మనస్సును బట్టే నేత్రాది ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. అవసరం లేనివి మనస్సులో చేరకుండా మనం చూసుకోవాలి.

బోయవాడు పన్నిన వలలో పక్షులు అమాయకంగా దిగుతాయి. తమకు తాముగా తయారుచేసుకున్న కోరికల వలలో దూరి మానవ్ఞలు పరితపిస్తూ ఉంటారు. విలువలు తెలియని వలపులన్నీ ఈ ప్రపంచంలో బంధించే వలలే. కలతల కలలే. ప్రపంచంలో పలవరింతలన్నీ పరితాపాలే. కలవరింతలన్నీ కన్నీళ్లే.

సీతాన్వేషణ సమయంలో ఆంజనేయ స్వామి రాత్రిపూట ఆదమరచి నిద్రిస్తున్న భార్యలను చూశాడు. విశేష సౌంద ర్యం గల వనితలు తొలగిన వస్త్రాలతో నిద్రిస్తున్న దృశ్యాలను కూడా చూశాడు. అయినా, తన మనస్సు వికారం చెందలేదు అంటాడు హనుమంతుడు.
కామం దృష్టా మయా సర్వా విశ్వస్తా రావణస్త్రియః న హి మే మనసః కించిత్‌ వైకృత్యం ఉపపద్యతేII స్వేచ్ఛగా నిద్రిస్తున్న చాలామంది స్త్రీలను నేను చూచింది వాస్తవమే. అయినా, నా మనస్సులో ఎట్టి వికారము కలగలేదు అన్నాడు ఆంజనేయస్వామి.
కళ్లు చూచినా మనస్సు వాటిని అనుసరించలేదు. ఈవిధమైన వివేకం ఉన్న వాళ్లందరూ హనుమంతులే అవ్ఞతారు. మనస్సును జయించినవాడు ప్రపంచాన్నే జయించగలడు. పర్వతాల్ని పెకలించగలడు. సాగర చలనాన్ని నిరోధించగలడు. వాయువేగాన్ని ఆపగలడు. అగ్ని తేజాన్ని చల్లబరచగలడు. ఇవన్నీ చేసి చూపాడు మనసును జయించిన హనుమంతుడు. మనసును అదుపు చేయలేక మైథిలి మారణహోమాన్ని సృష్టించుకుంది. మనసును పొదుపు చేసుకుని, మనుగడలో కుదుపును ఆపుకుని మహావైభవంతో శోభించాడు హనుమంతుడు .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close