Telangana

వరుస ఎన్నికలతో భారీగా మద్యం అమ్మకాలు

హైద్రాబాద్, ఏప్రిల్ 25, (Local News India)
రాష్ట్రంలో బీరు విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు ఏకంగా రెండింత లు పెరగడం ఎక్సైజ్ శాఖనే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా నూతన సంవత్సరం వేడుకలు జరిగే డిసెంబర్, జనవరి నెలలో బీరు అమ్మకాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ రెండు నెలల కన్నా మార్చిలో రెండు రెట్లు అధికంగా బీరు విక్రయాలు జరగడం గమనార్హం. వేసవి కావడంతో చల్లదనం కోసం తాగుతున్నారు అనుకున్నా.. గత విక్రయాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచి బీరు బాటిళ్ల విక్రయాలు పెరగడం సాధారణంగా జరుగుతుం టుంది. అయితే ఈసారి మార్చిలో రెండింతలు పెరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా, రెండోది పార్లమెంటు ఎన్నికలు. మార్చి రెండో వారంలో ఐపీఎల్ మ్యాచ్‌లు మొద లుకావడంతో బీర్ల కొనుగోళ్లు ఊపందుకుంది. దీనికితోడు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. దీంతో అటు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు ఓ వైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లను కొనుగోలు చేశాయి. మరోవైపు బీరు కొనుగోళ్లలో రాజకీయ పార్టీల వాటానే అధికంగా ఉన్నట్లు సమాచారం. కార్యకర్తలకు, యువతకు కేసుల కొద్దీ బీర్లను ఆయా పార్టీల నేతలు పంచారు. ఇక వేసవి కావడం తో మందుప్రియులు మద్యం బాటిళ్లకు బదులుగా బీరు బాటిళ్లను ఎంచుకోవడం మరో కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా మార్చి నెలలో బీరు బాటిల్ కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలులయ్యాయి. సాధార ణంగా ఎక్సైజ్ శాఖ విక్రయాల ప్రకారం.. ఐఎమ్‌ఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) అంటే బ్రాండీ వైన్ తదితరాలతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close