social

ప్రశాంతమైన మనసుతో యోగాభ్యాసం

యోగాభ్యాసం మొదలుపెట్టే ముందు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. ్య యోగసాధన చేసే ముందు మలమూత్ర విసర్జన తప్పనిసరి. ్య యోగసాధనకు 20నుంచి 30 నిముషాల ముందు మంచినీరు తాగటం అలవాటు చేసు కోవాలి. ్య Yసీలు బహిష్టు సమయంలో యోగాభ్యాసం చేయకూడదు. ్య ముఖ్యంగా ప్రశాంతమైన మనసుతో చేయాలి. మనసులో ఒత్తిడులు- కోపం, భయం, అయిష్టత, మొదలైనవి ఉన్నపుడు యోగసాధన చేయకూడదు. ్య యోగా చేయడానికి ముందు కాఫీ, టీల లాంటివి తీసుకోకూడదు. ్య శరీరాన్ని పట్టి ఉండే బిగుతైన దుస్తులు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు వదులుగా ఉండేలా కాటన్‌ దుస్తులు వేసుకోవాలి. ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అనుభవజ్ఞులైన యోగ శిక్షకుల సమక్షంలో యోగా భ్యాసం చేయటం మంచిది.

ఎప్పుడూ కూడా కడుపు నిండుగా ఉన్నప్పుడు వ్యాయామం చెయ్యవద్దు. ్య అల్పాహారం తిన్న రెండు గంటల తరువాత, మధ్యాహ్న భోజనం తిన్న 4గంటల తరువాతో వ్యాయామం చేస్తే మంచిది. ్య మీరు ఈ వ్యాయామాలని చేసేప్పుడు, మొదట్లో ఒక రకమైన ఇబ్బంది కలిగే అవకాశముంది, మీకు కళ్లు తిరిగినట్టనిపించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యనివాళ్లలో ఇది సామాన్యంగా కనిపిస్తుంది. చెమట రూపంలో శరీరంలోని విషపదార్థాలు బైటికి రావటం వల్ల ఇలా జరుగుతుంది. అయినప్పటికీ, మీరు ఆసనాలు వెయ్యటం ప్రారంభించిన రెండు వారాల్లో మీ శరీరం వాటికి అలవాటు పడిపోతుంది. ్య ఒళ్లునొప్పులు కూడా రావచ్చు. ముఖ్యంగా మొదలుపెట్టిన కొత్తలో. ఎందుకంటే చాలాకాలంగా మీరు మీ శరీరాన్ని, అంటే కాళ్లు, చేతులు, నడుములాంటివి వంచి ఉండరు. దీన్ని కూడా మీరు పట్టించుకోనక్కర్లేదు. రెండు వారాల్లో ఆ వ్యాయామాలకి తగినట్టు మీ శరీరం సర్దుకుంటుంది. ్య ఈ ఆసనాలన్నిటినీ అదే క్రమంలో చేస్తేనే, మీ శరీరానికి మీరు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. ఆసనాలు వేసేప్పుడు ఊపిరి ఎలా తీసుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీ శరీరాన్ని వెనక్కి వంచే భంగిమలో ఊపిరి పీల్చాలి. వంచేప్పుడు ఊపిరి వదలాలి. ఒకే భంగిమలో స్థిరంగా ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవా లి. ్య ఒక భంగిమలోకి మారేప్పుడు దానివల్ల ప్రభావితమయ్యే కండరం లేదా శరీరభాగం మీద దృష్టి కేంద్రీకరించండి. ఒక్కో ఆసనానికి మధ్య కనీసం 10 సెకన్ల విరామం ఉండాలి ్య వ్యాయామానికి ముందూ, తరువాతా కొద్ది నిమిషాల పాటైనా శరీరాన్ని వంచండి. ్య ఆసనాలు వేసేప్పుడు శరీరాన్ని మరీ ఎక్కువగా వంచద్దు. అలవోకగా ఆసనాలని వెయ్యండి.

సాధన ఇలా…

శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంలేని ప్రదే శాన్ని ఎంపిక చేసుకోవాలి. ్య గాలి, వెలుతురు ఉండే విశాలమైన గదిలో గాని, ఆరుబయట గాని మేడపైన గాని యోగా భ్యాసం చేయాలి. ్య ఉదయం, సాయంత్ర సమయాల్లో రెండు సార్లు యోగసాధన చేయాలి.

బ్రహ్మి ముహూర్త సమయంలో ధ్యానం చేయటం చాలామంచిది.

యోగా చేసేవారు చలికాలంలో గోరువెచ్చని నీటిని తాగాలి.యోగసాధనకు భోజ నానికి మధ్య ఐదునుంచి ఆరు గంటల వరకు కాలవ్యవధి ఉండా లి.

అంటే భోంచేసిన ఐదు లేదా ఆరుగంటలలోపు యోగా చేయకూడదు.

అనుభవజ్ఞులైన శిక్షకుల సమక్షంలో యోగా భ్యాసం నేర్చుకున్న తరువాతే స్వయం సాధన చేయటం చాలా మంచిది.

నేలమీద యోగసాధన చేయకూడదు. మెత్తని బెడ్‌షీట్‌ గాని కార్పెట్‌గాని వేసుకోవాలి.

గర్భిణులు ప్రాణాయామం, సూక్ష్మ వ్యాయామం మాత్రమే చేయవచ్చు. ఆసనాలు వేయకూడదు. వీరికి నడక చాలామంచిది.

యోగసాధన సమయంలో మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగసాధనకు 20నిముషాల ముందుగాని లేదా పూర్తయిన 20 నిముషాలకు తరువాత గాని తాగాలి.

యోగాసనాలు క్రమపద్ధతిలో వేయాలి. ముందుగా సూక్ష్మవ్యా యామంతో ప్రారంభించి ఆసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయా మం తదుపరి ధ్యానంతో ముగించాలి.

జ్వరంతో ఉన్నపుడుగాని, అధిక బి.పి ఉన్నపుడుగాని ఆసనాలు అసలు వేయకూడదు.

ఏవైనా శారీరక రుగ్మతల కారణంగా కింద కూర్చోలేని వారు ఏదైనా బల్లపై కూర్చుని యోగసాధన చేయాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close