National
4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసిన ఎయిర్‌టెల్
Hyderabad ;ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ ద్వారా ఎయిర్‌టెల్,4జీ నెట్ వర్క్ ప్రవేశపెడుతుండటం ద్వారా గృహాలు మరియు ఇతర అంతర్గత ప్రాంగణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరింత ఉత్తమ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తోంది.భారతదేశం యొక్క లీడింగ్ మొబైల్ నెట్‌వర్క్ ఎయిర్‌టెల్, తెలంగాణ రాష్ట్రంలో తన 4జీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసినట్లు నేడు వెల్లడించింది. 900 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ ద్వారా 4జీ నెట్ వర్క్ ప్రవేశపెడుతుండటం ద్వారా గృహాలు మరియు ఇతర అంతర్గత ప్రాంగణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరింత ఉత్తమ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తోందని వివరించింది.
900 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రం బ్యాండ్ ద్వారా 4జీ టెక్నాలజీ అందించడం రావడం వల్ల తెలంగాణలో అత్యంత వేగవంతమైన* మొబైల్ నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు మరింత హైస్పీడ్ డాటా కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తోంది.
దీనికంటే ముఖ్యంగా,900 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రం అందుబాటులోకి తేవడం ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు భవనాల లోపల, నివాసాల లోపల మరియు మాల్స్‌లలో ఉత్తమమైన 4జీ నెట్‌వర్క్‌ను అనుభూతి చెందగలరు. దీంతోపాటుగా తెలంగాణ వ్యాప్తంగా మరింత విస్తృతమైన 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడాన్ని ఆస్వాదిస్తారు.
ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ సీఈఓ అవ్‌నీత్ పురీ మాట్లాడుతూ, “మా వినియోగదారులకు అత్యుత్తమమైన నెట్‌వర్క్ అనుభూతిని కల్పించేందుకు మేం కృషి చేస్తున్నాం. ఎల్‌టీఈ 900 టెక్నాలజీని ప్రవేశపెట్టడం మా 4జీ నెట్‌వర్క్ కవరేజీని మరింత బలోపేతం చేస్తుంది. ప్రధానంగా ఇళ్లు మరియు భవంతుల లోపలి ప్రాంగణాల్లో ఉత్తమమైన నెట్‌వర్క్ అంతుదుంది. ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సాటిలేని డాటా స్పీడ్ మరియు హెచ్‌డీ క్వాలిటీ కాలింగ్ అనుభూతిని ఈ అప్‌గ్రేడ్ చేసిన నెట్‌వర్క్‌పై పొందగలరు. నూతన టెక్నాలజీలను అందుబాటులోకి తేవడం,తద్వారా వినియోగదారులకు ఉత్తమమైన నెట్‌వర్క్ అందించేందుకు మేం నిరంతరాయంగా పెట్టుబడులు పెడుతున్నాం“ అని వెల్లడించారు.