మంచిర్యాల ఏప్రిల్ 10 (Local News India):పెద్ద పెల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోనున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన లు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులతో సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు చర్యలు తీసుకోవడంతోపాటు, కేంద్రాలకు వచ్చే ప్రజల కోసం త్రాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా పాలనాధికారులు పేర్కొన్నారు. పెద్ద పెల్లి నియోజకవర్గంలో 14 లక్షల 69వేల 56 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పెద్ద పెళ్లి పార్లమెంట్ నియోజకవర్గం లో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన లోటుపాట్లను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లను చేశారు.
ఉదయం 8 గంటల నుండి ప్రారంభం.
మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో పంది లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడం కోసం జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి చర్యలు తీసుకున్నారు జిల్లాలో మొత్తం 730 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 73 పోలింగ్ కేంద్రాలు డిజిటల్ మానిటరింగ్ వెబ్ సిస్టం ఏర్పాటు చేశారు. భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో నేరుగా పోలింగ్ సరళిని వీక్షించే అవకాశం ఉంది. ఈ పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ, వి హెచ్ ఎఫ్ సెట్ ను ఏర్పాటు చేశారు. నిన్నటి మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు వారి గమ్యస్థానాలకు షేర్ పని పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు ఈరోజు ఉదయం 6 గంటలకు మాస్ పోలింగ్ నిర్వహించి అట్టి నివేదికను ఉదయం ఎనిమిది గంటల లోపు సహాయ రిటర్నింగ్ అధికారులకు అంది అందిస్తారు. దీనిని ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంపిస్తారు. ఎన్నికల తరలి పై గంటకు 17 సి, 17 ఏ ఫారాలను సరి చేసుకుంటారు. ముగిసిన అనంతరం ఎలక్ట్రానిక్ యంత్రాలు ఫీల్ అయ్యేంతవరకు ఏజెంట్లు అక్కడే ఉండి ఆ తర్వాత 17 సి ఫారం పై సంతకం చేయించుకొని పంపించడంతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
పెద్ద పెళ్లి పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1835, ఇందులో మంచిర్యాల జిల్లాలో 730, పెద్దపెల్లి జిల్లా లో 1105 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 307 గుర్తించారు. మంచిర్యాలలో జిల్లాలో 40, పెద్దపల్లి జిల్లాలో 127 ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఈ పెద్ద పల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కమిషనర్ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 98 గుర్తించారు. ఇందులో మంచిర్యాలలో 48, పెద్దపల్లి జిల్లాలో 50 కాగా ఈ ప్రాంతాల లో రామగుండం పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ కోసం ప్రయత్నం చేయగా వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూ పోలీస్ బలగాలు ఆయా ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎన్నికల్లో స్వేచ్ఛగా హోంవర్క్ వినియోగించుకునేలా అక్కడి ప్రజలను చైతన్యం చేశారు. ఇంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో స్పెషల్ పార్టీలతో, బాంబు స్క్వాడ్ ల ద్వారా 284 అలవాట్లు తనిఖీ చేశారు. పరిధిలో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2 గ్రేహౌండ్ పార్టీలు, స్పెషల్ పార్టీలతో వేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పాటు చేశారు.
ఓటుహక్కును వినియోగించుకోనున్న ప్రజలు
పెద్ద పెళ్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 14 లక్షల 69 వేల 56 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు ఏడు లక్షల 36వేల నాలుగు మంది కాగా, మహిళలు ఏడు లక్షల 32వేల 972 మంది తో పాటు 80 మంది ఇతరులు ఉన్నారు.
నియోజకవర్గం. స్త్రీలు. పురుషులు… మొత్తం
మంచిర్యాల..122929/124506/247455
బెల్లంపల్లి….81687/82292/163983
చెన్నూరు..6287/87571/173863
పెద్ద పెళ్లి..118031/118190/236228
రామగుండం..102704/106764/209496
ధర్మపురి..110664/107109/217775.
.. మంచిర్యాల జిల్లాలో 20 మంది, బెల్లంపల్లి14, చెన్నూర్5, పెద్ద పెళ్లి 7, మంథని 4, రామగుండం 28, ధర్మపురి 2, ఇతరులు ఉన్నారు.